కాంగ్రెస్ బీజేపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం
మన భారత్, ఆదిలాబాద్: Adilabad మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం ఉద్రిక్తతకు దారితీసింది. సమావేశంలో అజెండా అంశాలపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష సమావేశాన్ని కొనసాగిస్తూ అజెండా అంశాలను ఆమోదించామని ప్రకటించినట్లు సమాచారం. ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యులు సమావేశ మందిరం నుంచి బయటికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో పట్టణంలో తాగునీటి సమస్యపై చర్చించాలని బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. సమస్యను వెంటనే చర్చకు...