శ్రీ అభయాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు..
మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలం పొన్నారి గ్రామంలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి తృతీయ వార్షికోత్సవాన్ని కమిటీ సభ్యులు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు, అనంతరం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు, గ్రామస్థులకు...