కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం: కంది
మన భారత్ ప్రతినిధి, Adilabad: రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని కాంగ్రెస్ జిల్లా ఇన్‌చార్జ్ Kandi Srinivas Reddy అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఇటీవల ఎన్నికైన కౌన్సిలర్లు, సర్పంచ్‌లకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కంది శ్రీనివాస్ రెడ్డి, ప్రజలు ఇచ్చిన బాధ్యతను నూతన ప్రజాప్రతినిధులు సమర్థంగా నిర్వహించాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధి కోసం ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు....