గవర్నమెంట్ జాబ్.. ఒక్క రోజే అవకాశం.!
మన భారత్ , జాబ్స్: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు కీలక అవకాశం అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా రైల్వే శాఖలో గ్రూప్-D కేటగిరీలో భారీగా ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. మొత్తం 22,195 పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా, ఆన్లైన్ అప్లికేషన్‌కు రేపటితో గడువు ముగియనుంది. ఈ నియామకాలను Railway Recruitment Boards నిర్వహిస్తున్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 9 రాత్రి 11.59 గంటలలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు....