బాబోయ్ ఎండలు.. మూడు రోజులు జాగ్రత్త.!
మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు తీవ్ర ఎండలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు...