manabharath.com
Newspaper Banner
Date of Publish : 07 March 2026, 3:21 am Editor : manabharath

చైల్డ్ పోర్నోగ్రఫీ చూసిన ఇద్దరిపై కేసు..

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలను వీక్షించి ఇతరులకు పంపిణీ చేసిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఆదిలాబాద్ రూరల్ సీఐ ఫణిధర్ తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తాంసి మండలం వడ్డాడి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు చట్టవిరుద్ధంగా చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను మొబైల్ ఫోన్లలో వీక్షించినట్లు గుర్తించారు. అంతేకాకుండా ఆ వీడియోలను సోషల్ మీడియా వేదిక అయిన Instagram ద్వారా ఇతరులకు షేర్ చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు.

సమాచారం అందిన వెంటనే పోలీసులు దర్యాప్తు చేపట్టి, సాంకేతిక ఆధారాల ఆధారంగా వారి కార్యకలాపాలను గుర్తించినట్లు తెలిపారు. పిల్లలపై లైంగిక దాడులకు సంబంధించిన లేదా అలాంటి దృశ్యాలను వీక్షించడం, పంచుకోవడం చట్టపరంగా తీవ్రమైన నేరమని పోలీసులు హెచ్చరించారు.

ఈ ఘటనపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నామని సీఐ ఫణిదర్ తెలిపారు. ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు.

Mana BharathLeading News Portal