చెట్టు నీడనే బస్టాండ్.!
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో బస్టాండ్ సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రంగా ఉన్న తలమడుగు ప్రాంతానికి పరిసర గ్రామాల నుంచి ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల పనుల కోసం వస్తున్నారు. అయితే ఇక్కడ సరైన బస్టాండ్ లేదా బస్సు షెల్టర్ లేకపోవడంతో ఎండలో, వర్షంలో బస్సుల కోసం ఎదురుచూడాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల నుంచి వచ్చే ప్రజలు...