Gen Z ఓటర్లే కీలకం.. నేపాల్ సార్వత్రిక ఎన్నికలు షురూ
మన భారత్, నేపాల్: దక్షిణాసియా దేశమైన Nepalలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా మొత్తం 275 పార్లమెంట్ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో సుమారు 18.9 మిలియన్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం నుంచే పలుచోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భారీగా క్యూ కట్టారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుండగా, అనంతరం బ్యాలెట్ బాక్సులను సురక్షిత కేంద్రాలకు తరలించి 24 గంటల్లో కౌంటింగ్ ప్రక్రియ...