రేపు సెలవు.. చంద్రగ్రహణం ప్రభావం, ఎల్లుండి హోలీ వేడుకలు!
మన భారత్ , న్యూఢిల్లీ: హోలీ పండుగ తేదీపై ప్రజల్లో నెలకొన్న అయోమయం వీడింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ క్యాలెండర్ల ప్రకారం రేపు (మార్చి 3) పబ్లిక్ హాలిడేగా ప్రకటించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయబడతాయి. అయితే అదే రోజు చంద్రగ్రహణం ఉండటంతో హోలీ వేడుకలను ఎప్పుడు నిర్వహించాలి అనే సందేహం భక్తుల్లో వ్యక్తమవుతోంది. పండితుల సూచనల మేరకు చంద్రగ్రహణ ప్రభావం దృష్ట్యా రంగుల హోలీని మార్చి 4 (బుధవారం) జరుపుకోవడం శ్రేయస్కరమని...