అంగన్వాడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్: మంత్రి
మన భారత్ ,ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బందికి ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. రాష్ట్రంలోని సుమారు 5 వేల మినీ అంగన్వాడీ కేంద్రాలను పూర్తిస్థాయి అంగన్వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు రాష్ట్ర హోంమంత్రి అనిత వెల్లడించారు. అమరావతిలో అంగన్వాడీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆమె ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. మినీ కార్యకర్తలకు టీచర్ హోదా – పూర్తి స్థాయి వేతనాలు ప్రస్తుతం మినీ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలకు టీచర్లుగా ప్రమోషన్ కల్పించి, పూర్తిస్థాయి అంగన్వాడీ...