భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. పెట్టుబడిదారుల్లో ఆందోళన
మన భారత్ , హైదరాబాద్: మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఆదివారం కూడా భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి, యుద్ధ వాతావరణం కారణంగా సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లుతున్న ఇన్వెస్టర్లు గోల్డ్, సిల్వర్‌పై ఆసక్తి చూపడంతో ధరలు ఒక్కసారిగా ఎగబాకినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.4,370 పెరిగి రూ.1,73,080కు చేరింది. అలాగే 22...