కాకినాడలో ఘోర ప్రమాదం.. పేలుడుతో పంట పొలాల్లోకి ఎగిరిన శరీర భాగాలు
మన భారత్, కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో జరిగిన ఘోర పేలుడు ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భారీ శబ్దంతో సంభవించిన ఈ ప్రమాదంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడినట్లు స్థానికులు తెలిపారు. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో శరీర భాగాలు సమీపంలోని పంట పొలాల్లోకి ఎగిరిపడ్డాయని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. సమాచారం ప్రకారం, పరిశ్రమ ప్రాంతంలో బాణసంచా తయారీ జరుగుతున్న సమయంలో ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. పరిమితికి మించి బాణసంచా నిల్వ చేయడం, భద్రతా నిబంధనలు పాటించకపోవడం వంటి...