ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో రాజీ పడొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి
మన భారత్, తెలంగాణ: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై మరింత దృష్టి సారించాలని ముఖ్యమంత్రి Revanth Reddy అధికారులను ఆదేశించారు. కోర్ అర్బన్ రీజియన్‌లో ప్రభుత్వ స్కూల్స్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని స్పష్టం చేశారు. గురువారం ఐసీసీసీలో ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేట్ విద్యాసంస్థలతో సమానంగా మౌలిక సదుపాయాలు కలిగి...