ఎస్బీఐ ప్రత్యేక సౌకర్యం.. ఇంటి వద్దే లోన్ సమాచారం
మన భారత్, న్యూఢిల్లీ:
బ్యాంకు చుట్టూ తిరగకుండా, సులభంగా రుణ వివరాలు తెలుసుకునే అవకాశం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దేశంలోని అతిపెద్ద ప్రజారంగ బ్యాంక్ అయిన State Bank of India (SBI) వినియోగదారుల కోసం మిస్ కాల్, టోల్ ఫ్రీ నంబర్ సౌకర్యాన్ని అందిస్తోంది. ఈ విధానంతో రూ.50 లక్షల వరకు రుణం పొందే అవకాశంపై పూర్తి సమాచారం పొందవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి.?
అభ్యర్థులు 7208933142 నంబర్‌కు ఒక్క మిస్ కాల్ ఇవ్వాలి. లేదా 1800 1234 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలి. కాల్ చేసిన తర్వాత బ్యాంకు ప్రతినిధులు తిరిగి సంప్రదించి రుణానికి సంబంధించిన అర్హతలు, అవసరమైన పత్రాలు, వడ్డీ రేట్లు తదితర వివరాలు తెలియజేస్తారు.
అదేవిధంగా ఎస్ఎంఎస్ ద్వారా కూడా లోన్ సమాచారం పొందే సౌకర్యం కల్పించారు. డిజిటల్ సేవల ద్వారా వేగంగా ప్రాసెస్ పూర్తి చేసే విధానాన్ని బ్యాంక్ అమలు చేస్తోంది.
తక్కువ వడ్డీ – సులభ ప్రాసెస్
రుణం అవసరమున్న వ్యక్తులు, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి దారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. తక్కువ వడ్డీ రేట్లు, పారదర్శక నిబంధనలు, సులభ దరఖాస్తు విధానం ఈ స్కీమ్ ప్రత్యేకతలుగా బ్యాంకు పేర్కొంటోంది.
జాగ్రత్తలు కూడా అవసరం
అధికారిక నంబర్లకే కాల్ చేయాలని, వ్యక్తిగత బ్యాంక్ వివరాలు తెలియని వ్యక్తులతో పంచుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్ లేదా సమీప శాఖ ద్వారా కూడా వివరాలు ధృవీకరించుకోవచ్చు.
డిజిటల్ యుగంలో ఒక్క మిస్ కాల్‌తో రుణ సమాచారం పొందే ఈ సౌకర్యం వినియోగదారులకు ఎంతో ఉపయుక్తమని భావిస్తున్నారు.
