మూల మలుపులు.. నరకానికి పిలుపులు.!
- తాంసి అంతరాష్ట్ర రహదారిపై వరుస ప్రమాదాలు -వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ మన భారత్, తాంసి: తాంసి మండలంలోని అంతరాష్ట్ర రహదారిపై ప్రమాదాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా మూలమలుపులు అధికంగా ఉండడం, రహదారి ఇరువైపులా ముళ్ళపొదలు విస్తరించడం వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులు ప్రయాణికులకు ప్రాణహానికరంగా మారుతున్నాయని వారు చెబుతున్నారు. ప్రత్యేకంగా సాయంత్రం, రాత్రి వేళల్లో పరిస్థితి మరింత భయానకంగా మారుతోంది....