విధి రాసిన అగ్ని పరీక్ష: తండ్రి మృతదేహం ఇంట్లోనే… మరోవైపు ఇంటర్ పరీక్ష
మన భారత్, ఆంధ్ర ప్రదేశ్: ఇంట్లో కన్నతండ్రి మృతదేహం ఒక వైపు… మరోవైపు జీవితాన్ని నిర్ణయించే ఇంటర్ పరీక్ష. ఇలాంటి హృదయ విదారక ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. పేద కుటుంబానికి చెందిన ఓ విద్యార్థి విధి రాసిన అగ్ని పరీక్షను ఎదుర్కొన్న ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రానికి చెందిన కందల శివకుమార్ ఆదివారం గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూశారు. కుటుంబానికి ఆయనే ఆధారం. కష్టాల్లో పెరిగినా తన కుమారుడు...