అరగంట ముందే పరీక్ష కేంద్రానికి రండి.. ప్రిన్సిపల్ ఉదయ్ భాస్కర్
మన భారత్ ,ఆదిలాబాద్ : ఫిబ్రవరి 25 బుధవారం నుంచి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో తాంసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. ఉదయ భాస్కర్ తెలిపారు. విద్యార్థులు ఎటువంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అన్ని సదుపాయాలు కల్పించినట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రంలో తాగునీరు, పరిశుభ్రమైన టాయిలెట్లు, రవాణా సౌకర్యం, భద్రతా బందోబస్తు వంటి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. అదనంగా, అత్యవసర పరిస్థితులను...