అమరావతిలో భారీ మౌలిక వసతుల ప్రణాళిక.. రూ.40,887 కోట్లతో ట్రంక్ రోడ్లు నిర్మాణం
మన భారత్ ,ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అమరావతిలో భారీ స్థాయిలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ.40,887 కోట్ల వ్యయంతో ట్రంక్ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి సమీకరిస్తున్నట్లు సమాచారం. 96 కిలోమీటర్ల IRR – 8+4 లేన్లు ప్రణాళికలో భాగంగా ఇన్నర్ రింగ్ రోడ్ (IRR)ను 96 కిలోమీటర్ల మేర 8+4 లేన్లుగా నిర్మించనున్నారు. రాజధాని ప్రాంతంలో ట్రాఫిక్...