కల్తీ పాల ఘటనలో విషాదం.. రాజమండ్రిలో నలుగురు మృతి
మన భారత్ , ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి నగరంలో కల్తీ పాల ఘటన మరింత విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరినట్లు అధికారులు ధృవీకరించారు. ఇంకా 9 మంది బాధితులు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని వైద్య వర్గాలు వెల్లడించాయి. పరిస్థితి విషమం ఘటనకు గురైన వారిలో పలువురి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనూరియా (మూత్రం ఆగిపోవడం) లక్షణాలతో బాధితులు ఆస్పత్రులకు చేరినట్లు సమాచారం. కిడ్నీ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపినట్లు...