రాజమండ్రిలో కల్తీ పాల కలకలం.?
అనుమానాస్పద మృతి.. పలువురు అస్వస్థత మన భారత్ , ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి నగరంలో కల్తీ పాల కలకలం రేగింది. లాలాచెరువు ప్రాంతంలో కల్తీ పాలు తాగిన కారణంగా ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. స్థానికుల వివరాల ప్రకారం, నాలుగు రోజుల క్రితం పాలు తాగిన కొందరు వ్యక్తులు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 60 నుంచి 70 ఏళ్ల మధ్య...