గుమ్మడి గింజలు తింటే సంతాన సమస్యలు దూరం.!
గుమ్మడి గింజలు (Pumpkin Seeds) చిన్నవైనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాల భాండాగారం అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిలో ప్రోటీన్లు, ఫైబర్, మెగ్నీషియం, జింక్, ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్లు, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. రోజుకు సుమారు 30 గ్రాముల మేర గుమ్మడి గింజలు తీసుకుంటే శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు సూచిస్తున్నారు. సంతాన సమస్యలపై ప్రభావం గుమ్మడి గింజల్లో ఉండే జింక్ పురుషుల వీర్యకణాల నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది....