సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి అంతర్గత చర్చలకు దారితీసే విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద అనేక కీలక మంత్రిత్వ శాఖలను ఉంచుకోవడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా ఇంత పెద్ద సంఖ్యలో శాఖలను తన వద్ద ఉంచుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో బాధ్యతల విభజన అవసరమని, అధికార కేంద్రీకరణ ఆరోగ్యకరం కాదని వ్యాఖ్యానించారు....