ఫ్రీ బస్ పథకానికి స్మార్ట్ కార్డులు… రూ.75 కోట్ల వ్యయంపై చర్చ
మన భారత్, తెలంగాణ: తెలంగాణలో మహిళల కోసం అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకానికి సంబంధించి స్మార్ట్ కార్డుల జారీ అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. మహిళల ప్రయాణ సౌలభ్యం కోసం ప్రత్యేకంగా “మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు” అందించాలనే నిర్ణయంపై ప్రభుత్వం ముందడుగు వేస్తున్నట్లు సమాచారం. ప్రాథమికంగా జూన్ 2 నుంచి ప్రతి జిల్లాలో ఒక్కో మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి స్మార్ట్ కార్డుల జారీ చేపట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పైలట్ దశలో సుమారు 5 లక్షల...