మహిళలకు రూ.2,500 – పింఛన్లు రూ.4,000కు పెంపు..!
తెలంగాణ బడ్జెట్లో కీలక ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ మన భారత్, తెలంగాణ: తెలంగాణలో మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, సామాజిక భద్రత పింఛన్లను రూ.4,000కు పెంచే అంశంపై ప్రభుత్వం తుది కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో ఎన్నికల హామీ అమలు దిశగా అడుగులు వేస్తున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో 28న ప్రవేశపెట్టనున్న 2026-27 వార్షిక బడ్జెట్లో ఈ అంశాలపై ప్రకటన చేసే...