కరువుపై విజయం.. గ్రామస్తుల ఐకమత్యం
మన భారత్, మహారాష్ట్ర: ఒకప్పుడు 700 అడుగుల లోతున బోర్లు వేసినా చుక్క నీరు దొరకని దుర్భర పరిస్థితి… వేసవికాలంలో ట్యాంకర్లపై ఆధారపడిన జీవనం… ఇదే పరిస్థితి ఎదుర్కొన్న మహారాష్ట్రలోని బన్సావర్గావ్ గ్రామం నేడు దేశానికి ఆదర్శంగా నిలిచింది. గ్రామస్థుల ఐకమత్యం, పట్టుదల, సంకల్పం కరవును జయించి “ట్యాంకర్ రహిత గ్రామం”గా మలిచాయి. గ్రామ ప్రజలు సమస్యను ప్రభుత్వంపై వదిలేయకుండా స్వయంగా పరిష్కార దిశగా అడుగులు వేశారు. అందరూ కలిసి కాలువలు తవ్వడం, వర్షపు నీటి సంరక్షణ...