2026లో రెండు గ్రహణాలు.. అగ్ని పంచకం కాలంపై జ్యోతిష్యుల హెచ్చరిక
మన భారత్, ప్రత్యేక ప్రతినిధి: 2026 సంవత్సరంలో వరుసగా రెండు ముఖ్యమైన ఖగోళ ఘటనలు సంభవించనున్నాయి. ఫిబ్రవరి 17న సూర్యగ్రహణం, మార్చి 3న చంద్రగ్రహణం ఏర్పడనున్నాయి. ఈ రెండు గ్రహణాల మధ్య ఉన్న 15 రోజుల వ్యవధిని జ్యోతిషశాస్త్రంలో “అగ్ని పంచకం”గా పరిగణిస్తారు. ఈ కాలంలో రాహు–కేతు ప్రభావం అధికంగా ఉంటుందని జ్యోతిష్యులు పేర్కొంటున్నారు. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, ఈ కాలంలో వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక రంగాల్లో కొంత ప్రతికూల ప్రభావం కనిపించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు....