మన భారత్, ఆదిలాబాద్:
ప్రజాస్వామ్యంలో అభివృద్ధి లక్ష్యంగా సమాన ఆలోచనలు కలిగిన పార్టీలతో కలిసివెళ్లడం సముచితం అని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల పార్లమెంట్ ఇన్‌చార్జ్‌గా, బోధన్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఆయన సోమవారం నిజామాబాద్‌లోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు.
ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్పర్సన్‌గా ఎన్నికైన బండారి అనూష కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమెను పార్టీ నేతలు శాలువాలతో సత్కరించి అభినందించారు. అనంతరం కాంగ్రెస్ కండువా కప్పి అధికారికంగా పార్టీలోకి స్వాగతించారు.
పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సమన్వయంతో పనిచేస్తామని నేతలు పేర్కొన్నారు. మున్సిపల్ పరిపాలనలో పారదర్శకత, మౌలిక వసతుల మెరుగుదల, పౌర సేవల విస్తరణకు కట్టుబడి ఉంటామని తెలిపారు.
Adilabad, Municipal Chairperson, Congress Party, Sudarshan Reddy, Telangana Politics, Bhandari Anusha
అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్:
బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జైనథ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. శ్రావణ్ కుమార్ వివరాల ప్రకారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
తేదీ 16.02.2026న అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సాత్నాల మండలం దౌనా గ్రామ శివారులో చెక్‌డ్యామ్ వెనుక అటవీ భూమిలో ఒక వ్యక్తి గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు తెలిసింది. వెంటనే బేల ఎస్‌ఐ ఎల్. ప్రవీణ్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. వ్యవసాయ భూమిలో జొన్న పంట మధ్య అంతర పంటగా గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు గుర్తించారు.
మొత్తం 92 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో 46 మొక్కలు పీకేసి ఎండబెట్టినవి కాగా, మిగతా 46 మొక్కలు నిలువుగా పెరిగినవిగా గుర్తించారు. స్వాధీనం చేసిన గంజాయి మొక్కల అంచనా విలువ సుమారు రూ.9,20,000గా ఉందని అధికారులు తెలిపారు.

ఈ కేసులో నిందితుడు చంకటి బాపురావు @ చకటి బౌరావు (75), తండ్రి భీమా, వృత్తి వ్యవసాయం, నివాసం దౌనా గ్రామం, సాత్నాల మండలం. అతనిపై క్రైమ్ నెంబర్ 44/2026గా నమోదు చేసి, ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 సెక్షన్ 8(b) r/w 20(a)(i) ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన ఎస్‌ఐ ఎల్. ప్రవీణ్ మరియు సిబ్బందిని సీఐ అభినందించారు. గంజాయి, మాదక ద్రవ్యాల సాగు, రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే డయల్ 100 ద్వారా లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని సూచించారు.
అక్రమ గంజాయి సాగు చేసే వారిపై ప్రభుత్వం పథకాలు రాకుండా సిఫార్సు చేయనున్నట్లు కూడా అధికారులు హెచ్చరించారు.
