ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనూష బండారి ఎన్నిక
ఉత్కంఠకు తెర – స్వతంత్ర అభ్యర్థికి విస్తృత మద్దతు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్పర్సన్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. స్వతంత్ర అభ్యర్థి అనూష బండారి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. మొత్తం 27 మంది కౌన్సిల్ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించగా, 45వ వార్డు కౌన్సిలర్‌గా గెలిచిన అనూష బండారికి మెజారిటీ మద్దతు లభించింది. మున్సిపల్ ఎన్నికల్లో Bharatiya Janata Party 21 వార్డుల్లో విజయం సాధించగా, Indian National Congress 11 వార్డుల్లో...