మన భారత్ ఆదిలాబాద్:
ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 34వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి షేక్ నజీర్ అహ్మద్ హోరాహోరీగా సాగిన ఎన్నికల పోరులో విజయం సాధించారు. ఈ వార్డులో ఉత్కంఠభరితంగా కొనసాగిన ఓట్ల లెక్కింపులో ఆయనకు మొత్తం 638 ఓట్లు లభించగా, సమీప బీజేపీ అభ్యర్థి వకుళాభరణం నీఖిల 626 ఓట్లు సాధించారు.
దీంతో కేవలం 12 ఓట్ల స్వల్ప మెజారిటీతో షేక్ నజీర్ అహ్మద్ విజేతగా నిలిచినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. ప్రతి రౌండ్‌లో ఆధిక్యం మారుతూ ఉత్కంఠ రేపిన ఈ పోరు చివరి వరకు ఆసక్తిని కలిగించింది.
ఫలితాలు వెలువడగానే ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలు తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలుపుతూ, వార్డు అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తానని నజీర్ అహ్మద్ తెలిపారు. ముఖ్యంగా మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు.
34వ వార్డులో స్వల్ప తేడాతో వచ్చిన ఈ ఫలితం ఆదిలాబాద్ మున్సిపల్ రాజకీయాల్లో ప్రత్యేక చర్చకు దారితీసింది.