ఆదిలాబాద్ 33వ వార్డులో కాంగ్రెస్ విజయం – మహబూబ్ స్వల్ప మెజార్టీతో గెలుపు
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీ 33వ వార్డు ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి మహబూబ్ విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆయనకు మొత్తం 618 ఓట్లు లభించగా, సమీప బీజేపీ అభ్యర్థిపై కేవలం 21 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజేతగా నిలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 33వ వార్డులో లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠభరితంగా కొనసాగింది. ప్రతి రౌండ్లోనూ ఆధిక్యం మారుతూ ఆసక్తిని రేకెత్తించగా, తుది ఫలితంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం సాధించడం విశేషంగా...