manabharath.com
Newspaper Banner
Date of Publish : 13 February 2026, 10:07 pm Editor : manabharath

ఆదిలాబాద్ 40వ వార్డులో కాంగ్రెస్ ఘన విజయం – అమరబోయిన సాయిచరణ్ గౌడ్ భారీ మెజార్టీ

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని 40వ వార్డు ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి అమరబోయిన సాయిచరణ్ గౌడ్ మొత్తం 1351 ఓట్లు సాధించి విజేతగా నిలిచారు. సమీప బీజేపీ అభ్యర్థి 968 ఓట్లు సాధించగా  మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు.

40వ వార్డులో ఈ ఫలితం కాంగ్రెస్‌కు గట్టి ఆధిక్యాన్ని చాటిచెప్పింది. భారీ మెజారిటీతో గెలవడం స్థానిక రాజకీయాల్లో విశేషంగా మారింది. ఫలితాలు వెలువడగానే పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.

ప్రజలు తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలుపుతూ వార్డు అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తానని సాయిచరణ్ గౌడ్ పేర్కొన్నారు. ముఖ్యంగా తాగునీటి సదుపాయాలు, పారిశుధ్యం, రహదారుల అభివృద్ధి, యువత మరియు మహిళల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు.

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల లెక్కింపు పూర్తవడంతో అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. 40వ వార్డు ఫలితం ఆదిలాబాద్ మున్సిపల్ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.