ఆదిలాబాద్ 7వ వార్డులో బీజేపీ జెండా.. దుమ్మని రజిత ఘన విజయం
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీ 7వ వార్డు ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి దుమ్మని రజిత ఘన విజయం సాధించారు. అధికారిక లెక్కల ప్రకారం ఆమెకు మొత్తం 601 ఓట్లు లభించగా, సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 199 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 7వ వార్డులో ఈ ఫలితం బీజేపీ శ్రేణులకు ఉత్సాహాన్ని కలిగించింది. ఫలితాలు వెలువడగానే పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. దుమ్మని రజితకు శుభాకాంక్షలు తెలుపుతూ వార్డు అభివృద్ధికి...