ఆదిలాబాద్ 28వ వార్డులో బీజేపీ జెండా ఎగిరింది – బొడిగం శ్రీకాంత్ ఘన విజయం
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 28వ వార్డులో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి బొడిగం శ్రీకాంత్‌కు మొత్తం 492 ఓట్లు లభించగా, సమీప ఎంఐఎం (MIM) అభ్యర్థిపై 83 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. 28వ వార్డులో ఈ ఫలితం బీజేపీకి మరింత ఉత్సాహాన్ని కలిగించింది. ఫలితాలు వెలువడగానే పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. విజయం అనంతరం బొడిగం శ్రీకాంత్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు....