ఆదిలాబాద్ 32వ వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ అభ్యర్థి రోహిణ ఫాతిమా విజయం
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల లెక్కింపులో 32వ వార్డుకు కాంగ్రెస్ అభ్యర్థి రోహిణ ఫాతిమా విజయం సాధించారు. అధికారిక ఫలితాల ప్రకారం ఆమెకు 1,153 ఓట్లు లభించగా, సమీప బీఆర్ఎస్ అభ్యర్థి సల్మా సుల్తానాకు 985 ఓట్లు వచ్చాయి. దీంతో రోహిణ ఫాతిమా 168 ఓట్ల మెజారిటీతో విజేతగా నిలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 32వ వార్డులో జరిగిన ఈ పోరు ఉత్కంఠభరితంగా సాగగా, చివరికి కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం సాధించడం విశేషంగా మారింది....