మన భారత్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి రాంపల్లి శ్వేత విజయం సాధించారు. అధికారిక లెక్కల ప్రకారం ఆమెకు మొత్తం 686 ఓట్లు పోలవ్వగా, ఎంఐఎం పార్టీ అభ్యర్థి జమీల బేగంకు 478 ఓట్లు వచ్చాయి. దీంతో రాంపల్లి శ్వేత 208 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
ఈ ఫలితంతో 10వ వార్డులో బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. విజయం అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్వేతకు అభినందనలు తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ వార్డు అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు.
ప్రత్యేకంగా తాగునీటి సదుపాయం, పారిశుధ్యం, అంతర్గత రహదారుల అభివృద్ధి, వీధి దీపాల మెరుగుదలపై దృష్టి సారిస్తానని శ్వేత హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను సమయానికి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. 10వ వార్డు ఫలితం స్థానిక రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.