49వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి వెనగంటి ప్రకాశ్ విజయం
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని 49వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి వెనగంటి ప్రకాశ్ విజయం సాధించారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ అనంతరం అధికారులు అధికారికంగా ఫలితాన్ని ప్రకటించారు. వివరాల ప్రకారం వెనగంటి ప్రకాశ్‌కు మొత్తం 485 ఓట్లు లభించగా, బీజేపీ అభ్యర్థి బండారి సంతోష్‌కు 397 ఓట్లు వచ్చాయి. దీంతో 88 ఓట్ల స్పష్టమైన మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. కౌంటింగ్ ప్రారంభం నుంచే పోటీ హోరాహోరీగా సాగినప్పటికీ చివరికి ప్రకాశ్ ఆధిక్యం నిలబెట్టుకున్నారు. ఫలితం...