11వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి అంజలి ఘన విజయం
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 11వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి అంజలి విజయం సాధించారు. కౌంటింగ్ ముగిసిన అనంతరం ఎన్నికల అధికారులు అధికారికంగా ఫలితాన్ని ప్రకటించారు. వివరాల ప్రకారం 11వ వార్డు నుంచి పోటీ చేసిన అంజలికి మొత్తం 563 ఓట్లు లభించాయి. ఆమె సమీప ప్రత్యర్థి ఎంఐఎం అభ్యర్థి అనితపై స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందినట్లు వెల్లడించారు. కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగినప్పటికీ చివరికి బీఆర్ఎస్ అభ్యర్థి విజయం ఖరారైంది. ఫలితం వెలువడగానే...