manabharath.com
Newspaper Banner
Date of Publish : 13 February 2026, 12:28 pm Editor : manabharath

ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ బోణీ.. 37వ వార్డులో అంబకంటి సుష్మ అశోక్ విజయం

ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ బోణీ.. 37వ వార్డులో అంబకంటి సుష్మ అశోక్ విజయ

మన భారత్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచింది. 37వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అంబకంటి సుష్మ అశోక్ విజయం సాధించి పార్టీకి బోణీ కొట్టారు.

అధికారుల వెల్లడించిన వివరాల ప్రకారం అంబకంటి సుష్మ అశోక్‌కు మొత్తం 786 ఓట్లు పోలవ్వగా, బీజేపీ అభ్యర్థి నల్ల మానసకు 590 ఓట్లు లభించాయి. దీంతో 196 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యాన్ని నమోదు చేశారు.

కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం నుంచే పోటీ ఉత్కంఠభరితంగా సాగింది. ప్రతి రౌండ్‌లోనూ ఆధిక్యం మారుతుందేమోనన్న ఆసక్తి నెలకొన్నప్పటికీ చివరికి కాంగ్రెస్ అభ్యర్థి విజయం ఖరారైంది. ఫలితం వెలువడగానే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.

వార్డు అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం కృషి చేస్తానని విజేత అభ్యర్థి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ బోణీ కొట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.