ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం 21 వార్డుల్లో విజయం, పీఠం దిశగా కాషాయ అడుగులు
మన భారత్, ఆదిలాబాద్: ఉత్కంఠభరితంగా సాగిన ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల సమరంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) స్పష్టమైన ఆధిక్యాన్ని నమోదు చేసింది. మొత్తం 49 వార్డుల ఫలితాల్లో 21 స్థానాలు కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. చైర్మన్ పీఠం దిశగా బీజేపీ అడుగులు వేస్తుండగా, ఎక్స్ అఫీషియో ఓట్లు మరియు స్వతంత్రుల మద్దతు కీలకం కానుంది. 21 వార్డుల్లో కమలం వికసించింది ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ఎన్నికల్లో పట్టణ ఓటర్లు కమలం గుర్తుకు...