మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ విషాదం..
మన భారత్, తెలంగాణ: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. 10వ వార్డు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బత్తిని ఎల్లమ్మ అనారోగ్యంతో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఈ వార్త వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది. సమాచారం ప్రకారం, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎల్లమ్మ ఆరోగ్య పరిస్థితి ఇటీవల విషమించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచినట్లు తెలిసింది. ఇదే సమయంలో...