విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మన భారత్, న్యూఢిల్లీ: విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ‘బ్యాగేజీ రూల్స్–2026’ పేరుతో రూపొందించిన కొత్త నిబంధనలు ఫిబ్రవరి 2, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ఇప్పటివరకు అమలులో ఉన్న 2016 బ్యాగేజీ రూల్స్ రద్దయ్యాయి. కొత్త నిబంధనలతో ప్రయాణికులకు కొన్ని అంశాల్లో వెసులుబాటు కల్పించగా, మరికొన్ని విషయాల్లో స్పష్టత తీసుకువచ్చారు. ముఖ్యంగా బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులు, జనరల్ అలవెన్స్ పరిమితులపై మార్పులు చేశారు. బంగారం తీసుకురావడంపై స్పష్టత...