మేడారం జాతరపై కావాలనే తప్పుడు ప్రచారం: మంత్రి
మన భారత్, తెలంగాణ: ప్రపంచ ప్రఖ్యాత మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరపై కావాలనే తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలంగాణ మంత్రి సీతక్క తీవ్రంగా మండిపడ్డారు. కొంతకాలంగా జాతర స్వరూపాన్ని వక్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటి వెనుక ఉద్దేశపూర్వక కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. ఇటీవల మేడారం జాతరకు అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా పట్టణాలకు చెందిన చదువుకున్న వర్గాలు కూడా పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారని మంత్రి సీతక్క తెలిపారు. ఈసారి జాతరకు మరింత ఎక్కువ మంది ‘హైక్లాస్’ ప్రజలు...