మున్సిపల్ ఎన్నికల్లో జోరుగా ప్రచారం
మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు ఇచ్చిన గడువు మంగళవారం సాయంత్రం 3 గంటలతో ముగియడంతో, ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. దీంతో ఎన్నికల ప్రచారానికి అధికారికంగా తెరలేచింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఫిబ్రవరి 11వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది....