బండి సంజయ్‌కు కనీసం పీఎం అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు: సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు
మన భారత్, తెలంగాణ: కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ ముందు నిలబడి తెలంగాణకు నిధులు అడిగే ధైర్యం బండి సంజయ్‌కు లేదని, కనీసం ప్రధాని అపాయింట్మెంట్ కూడా ఆయనకు లభించడంలేదని సీఎం ఆరోపించారు. కరింనగర్ సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాటం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని...