ఆదిలాబాద్, మన భారత్:
జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మున్సిపాలిటీలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వార్డ్ ఇంచార్జిల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కర్ణాటక శాసనసభ్యులు అబాయ్ పాటిల్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా అబాయ్ పాటిల్ మాట్లాడుతూ, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి వార్డులో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వార్డ్ ఇంచార్జిలు ప్రజలతో నిత్యం మమేకమై, కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ కార్యకర్తల సమన్వయంతో పనిచేస్తే విజయం సాధించడం సాధ్యమని పేర్కొన్నారు.
జిల్లాలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి వార్డులో బూత్ స్థాయి కమిటీలను మరింత చురుకుగా పనిచేయించాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి పోరాటం చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు బ్రహ్మానందం, జిల్లా ఉపాధ్యక్షులు బోండ్ల వెంకట స్వామి మున్సిపల్ ఎన్నికల ఇంచార్జిలు, సీనియర్ నాయకులు, వార్డ్ స్థాయి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా సమిష్టిగా కృషి చేయాలని నాయకులు నిర్ణయించారు.