సీఎం కప్ క్రీడా పోటీల ఉత్సాహం.. విజేతలకు బహుమతుల ప్రధానం
మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన సీఎం కప్ క్రీడా పోటీలు ఉత్సాహంగా ముగిశాయి. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు. విద్యార్థులు, యువత అధికంగా పాల్గొనడంతో క్రీడా మైదానం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు నిర్వాహకులు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న...