ఆల్టైమ్ హైకి చేరిన బంగారం ధరలు.. 10 గ్రాములు రూ.1.85 లక్షలు
మన భారత్, హైదరాబాద్: పసిడి పరుగులు ఆగడం లేదు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, డాలర్ మారకపు విలువల్లో హెచ్చుతగ్గులు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో బంగారం ధరలు రోజురోజుకూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ పరిణామాల ప్రభావంతో ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరాయి. తాజా ధరల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రిటైల్ ధర 3 శాతం జీఎస్టీతో కలిపి ఏకంగా రూ.1,85,000ను దాటింది. గత...