గద్దెపైకి చేరుకోనున్న సమ్మక్క.. మేడారం మహాజాతరలో నేడు ప్రధాన ఘట్టం
మన భారత్, తెలంగాణ: ప్రపంచ ప్రసిద్ధ మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో ఇవాళ అత్యంత కీలక ఘట్టానికి తెరలేవనుంది. భక్తుల కొంగు బంగారం సమ్మక్క తల్లి మేడారం గద్దెపై కొలువుదీరనుండటంతో జాతర ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. సాయంత్రం పూజారులు చిలుకలగుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని ఊరేగింపుగా తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించనున్నారు. ఈ మహాఘట్టం సందర్భంగా సంప్రదాయానుసారం జిల్లా ఎస్పీ గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరుపుతారు. ఇది మేడారం జాతరలో అనుసరించబడే...