ఆ నేతల జేబుల్లోకి ప్రభుత్వ ఆదాయం: మాజీ సీఎం జగన్
మన భారత్, ఆంధ్ర ప్రదేశ్: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వంలో ఏ వర్గానికీ మేలు జరగలేదని, ప్రజల ఆకాంక్షలు పూర్తిగా విస్మరించబడ్డాయని ఆయన ఆరోపించారు. గత రెండేళ్ల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలుగా తేలాయని జగన్ అన్నారు. రాష్ట్ర ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన బదులు చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరుల జేబుల్లోకి...