manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 January 2026, 8:54 am Editor : Editor Vishal Kumar

భారీ ధరకు ‘స్పిరిట్’ OTT హక్కులు.?

మన భారత్, సినిమా:

డార్లింగ్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘స్పిరిట్’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే చిత్రీకరణ ఇంకా పూర్తికాకముందే ఈ సినిమా OTT హక్కులకు గట్టి డిమాండ్ ఏర్పడినట్లు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం ‘స్పిరిట్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక ‘నెటిక్స్’ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. హీరో, దర్శకుల రెమ్యునరేషన్‌లను మినహాయించి, మొత్తం సినిమా బడ్జెట్‌ కంటే ఎక్కువ మొత్తానికి OTT రైట్స్ విక్రయమైనట్లు పరిశ్రమలో చర్చ జరుగుతోంది. ఇది ప్రభాస్ మార్కెట్‌ స్థాయి, అలాగే సందీప్ రెడ్డి వంగా బ్రాండ్‌కు నిదర్శనంగా భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ‘స్పిరిట్’ సినిమా రెండో షెడ్యూల్ చిత్రీకరణ ఫిబ్రవరి 15 నుంచి తిరిగి ప్రారంభం కానున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్, క్రేజీ కాంబినేషన్‌తో రూపొందుతున్న ఈ సినిమా బాక్సాఫీస్‌తో పాటు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై కూడా రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.